ఆనందం-మహదానందం

ఆనందం-మహదానందం

ఉత్సాహం వురకలు వేస్తూంటే జీవితంలో ముందడుగు వేయడానికి ఆతృత పడుతున్న యువత దేశానికి చాలా ముఖ్యం, వెన్నెముక వంటిది. అలాంటి అమూల్యమైన యువసేనని వెన్ను తట్టి ముందడుగు వేయించి కాపాడుకోవలసిన బాధ్యత దేశం యొక్క భుజస్కందాల మీద వుంది కదా! ఆబాధ్యత యీ గ్రాడ్యుయేషన్ ద్వారా చాలావరకు నెరవేరుతుందని నాఅభిప్రాయం. హైస్కూలు చదువు వరకూ పిల్లలు ఒక రక్షణవలయంలో పెరుగుతారు. ఇంట్లో తల్లితండ్రులూ, స్కూల్లో టీచర్లూ …. అన్ని విధాలా వాళ్లకి చేయూతనందిస్తూ ముందుకి నడిపిస్తారు. స్కూలు చదువు ముగించుకున్న పిల్లలు …. పైచదువులు చదివేవాళ్లూ, వృత్తివిద్యలు నేర్చుకునేవాళ్లూ, వుద్యోగావకాశములు వున్నకోర్సులు చదివేవాళ్లూ, నేరుగా సంపాదన మొదలుపెట్టేవాళ్లూ ….. యిలా రకరకాలుగా దారులు యెంపిక చేసుకుని ముందుకి సాగుతారు. అందరికీ గ్రాడ్యుయేషన్ వేడుకలో స్కూలు సర్టిఫికేట్ అందుకోవడము ఒకతీపిజ్నాపకమై మనసులో ముద్రించుకుని జీవితపయనంలో వుల్లాసపరుస్తుంది. నిజంగా యీఘడియ వాళ్లకి యెంత అమూల్యమైనదీ, అపురూపమైనదీ కదా! సర్టిఫికేటు అందుకోగానే వాళ్లకి ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. దానితో బాటుగా జీవితం పట్ల బాధ్యత కూడా పెరుగుతుంది.

ప్రకటనలు
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

3 Responses to ఆనందం-మహదానందం

  1. Siri & ravi అంటున్నారు:

    Chaala baavundi, nice pictures too

  2. Ramana అంటున్నారు:

    Well written. Our wishes to the fresh ‘graduate’! All the best.

  3. radharaopv అంటున్నారు:

    Good wish. Really our future citizens need to be very loyal to our country.Well written with a good feel.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s